గొల్ల, కురుమ, యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

జహీరాబాద్ ఆగస్టు 19 (జనంసాక్షి)గొల్ల, కురుమ, యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రముఖులు ఎం జి రాములు పూజ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.జహీరాబాద్ పట్టణంలోని జాతీయ రహదారిపై భవాని మందిర్,కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ కృష్ణుని ప్రతిమకు పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం రహదారి పక్కన ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో ఉన్న చిన్నారులు ఉట్టి కొట్టి అలరించారు. గొల్ల కురుమ యాదవ సంఘం నాయకులు ఉట్టి కొట్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అనంతరం దత్తగిరి కాలనిలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి జన్మాష్టమి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా గోపిక కృష్ణులకు అతిథులు జ్ఞాపికలను ప్రదానం చేశారు ఉత్సవాలలో పాల్గొన్న ఉపాధ్యాయులకు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు రమేష్ బాబు, రాజా రమేష్, సుభాష్,పాండు, తట్టు నారాయణ,మహేష్,మల్లేష్,మల్లికార్జున్, విశ్వనాథ్, నర్సింహ,పులెందర్,శ్రీనివాస్,వేణు గోపాల్, ఏంజి లక్ష్మణ్, అంజన్న, శ్రీశైలం సార్ ,లక్ష్మణ్, శ్రీశైలం ఇంజినీర్,శివరాజ్, దుర్గయ్య,తదితరు సంఘం నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు