గోడ కూలి బాలుడి మృతి

వరంగల్ : వరంగల్ జిల్లాలో గోడ కూలి మహేందర్ (5) అనే బాలుడు గురువారం మృతిచెందాడు. మహబూబ్ నగర్ మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ రోడ్‌లో ఉండే మహేందర్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా గోడకూలింది. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.