గోదాములను పరిశీలించిన నాబార్డ్, టెస్కాబ్ అధికారులు

రైతులు సొసైటీ గోదాములను సద్వినియోగం చేసుకోవాలి;కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు
కోదాడ టౌన్ సెప్టెంబర్ 22 ( జనంసాక్షి )
కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలు కూచిపూడి, గణపవరం,తొగర్రాయి,తమ్మర బండ పాలెం గ్రామాలలో రైతుల ధాన్యం నిల్వ కొరకు నాబర్డు నిధులతో సుమారు కోటి రూపాయల సబ్సిడీ రుణంతో గోదాముల నిర్మాణం పూర్తయిన సందర్భంగా నాబార్డ్, టెస్కాబ్ అధికారులుగురువారం నాలుగు గ్రామాల్లోని గోదాములను సందర్శించి నిర్మాణం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసి తదుపరి ప్రారంభోత్సవం చేసుకొనుటకు అనుమతులు ఇచ్చారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు మాట్లాడుతూ సొసైటీ నూతన కార్యవర్గం ఏర్పడ్డాక రైతుల ఉపయోగార్ధం ధాన్యం నిల్వల కొరకు గోదాముల నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు.ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చే అతి త్వరలోనే ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు.కావున రైతులందరూ తాము పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోకుండా సొసైటీ గోదాల్లో నిల్వ చేసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాబార్డ్,టేస్కబ్ అధికారులు డీజీఎం.ఏ.అశోక్, ఏజీఎం శ్రీనివాస్ కుమార్,మనీకాంత్,అసిస్టెంట్ మేనేజర్ సుగుణ కుమార్,కోదాడ బ్రాంచ్ మేనేజర్ సుధాకర్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటనారాయణ సీఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.