గోమాంసం అనుమానంతో ఇద్దరు ముస్లిం మహిళలపై అమానుష దాడి

3
3A
– రాజ్యసభలోనూ నిరసన

భోపాల్‌,జులై 27(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో గోమాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో ఇద్దరు మహిళలను  గో రక్షక దళం సభ్యులు చితకబాదారు. రాజధాని భోపాల్‌కు 350 కిలోవిూటర్ల దూరంలోని మంద్‌సౌర్‌ రైల్వేస్టేషన్‌ సవిూపంలో ఈ ఘటన జరిగింది. దళం సభ్యులు వారిని తీవ్రంగా కొడుతున్నా.. అక్కడున్న పోలీసులు వారిని వారించలేదు. ప్రయాణికులు కూడా ఫోన్లలో వీడియో తీస్తూ కనిపించారు. ఎక్కువ మొత్తంలో బీఫ్‌ అమ్ముతున్నారన్న సమచారాంతో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా దళం సభ్యులు వారిపై దాడి చేశారు. గో మాతా కీ జై అన్న నినాదాలు చేస్తూ వారు ఈ దాడికి పాల్పడ్డారు. సుమారు అరగంట పాటు ఆ మహిళలను చితకబాదిన తర్వాత పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వారి నుంచి 30 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని పరీక్షలకు పంపించగా అది బర్రె మాంసమని తేలింది. అయితే అనుమతి లేకుండా మాంసం అమ్ముతున్నారన్న ఆరోపణలపై మహిళలు ఇంకా పోలీసు కస్టడీలోనే ఉన్నారు. మరోవైపు ఈ దాడి చేసినవారిపై, అక్కడున్న పోలీసులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్‌ ¬ంమంత్రి భూపేంద్రసింగ్‌ విచారణకు ఆదేశించారు.

రాజ్యసభను కుదిపిన మహిళలపై దాడి ఘటన

మధ్యప్రదేశ్‌లో దళితులపై దాడి అంశంపై బుధవారం రాజ్యసభ దద్దరిల్లింది. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నినాదాలు చేస్తూ విపక్షాలు  పోడియం వద్దకు దూసుకెళ్లారు. దళితుల అంశంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ప్రధానమంత్రి దళిత వ్యతిరేకి అంటూ బీఎస్పీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. బీఎస్పీ సభ్యులకు కాంగ్రెస్‌ సభ్యులు కూడా మద్దతు పలకడంతో రాజ్యసభ దద్ధరిల్లింది. మధ్యప్రదేశ్‌లో గో మాంసం తీసుకెళ్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు మహిళలపై గో రక్షకదళం దాడి చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించారు. గేదె మాంసాన్ని ఆవు మాంసంగా భావించి దాడిచేయడం సరికాదని విమర్శించాయి. గోరక్షణ పేరుతో భాజపా పాలిత రాష్టాల్ల్రో హింస పెరుగుతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు గులాంనబీ అజాద్‌ మాట్లాడుతూ.. గోరక్షణకు తాము వ్యతిరేకం కాదని, గోరక్షణ పేరుతో దళితులపై దాడులు సరికాదన్నారు.  ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు అనుకూలమైన ప్రభుత్వంగా చెప్పుకుంటున్న బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్‌లో బీఫ్‌ పేరుతో మహిళపై దాడి జరగడాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సమాధానమిస్తూ.. దేశంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా సమర్థించబోం అని స్పష్టం చేశారు. బాధ్యులపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.