గోవులు తరలిస్తున్న వారిపై కేసు

మునుగోడు సెప్టెంబర్12(జనంసాక్షి):
గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.సతీష్ రెడ్డి తెలిపారు.శ్రీకాకుళం నుండి మునుగోడు మీదుగా హైదరాబాద్ కు డీసీఎంలో తరలిస్తున్న 51గోవులను మునుగోడు పోలీసులు పట్టుకొని గోవుల తరలింపు దారుడు అయిన నిందితుడు భూపతి మోహన్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.