గోసాంపల్లి సర్పంచ్ కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ.
దుబ్బాక 01,జూన్ ( జనం సాక్షి )
దుబ్బాక మండలంలోని గోసాన్ పల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి తండ్రి నర్సారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గోసాన్ పల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దుబ్బాక టిఆర్ఎస్వీ నాయకులు రేపాక భాను మాతృమూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి విషయం తెలుసుకొని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెను ఎంపీ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు.