గ్యాస్ సిలిండర్ ధర వెంటనే తగ్గించాలి: బీఆర్ఎస్

ధర్మపురి గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా ధర్మపురి నియోజకవర్గం లో నిర్వహించిన ధర్నాలు పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్న  BjP ప్రభ్యత్వం…వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ధర్మపురి నియోజకవర్గం లోని నిర్వహించిన ధర్నా, ఆందోళనలు ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీని మహిళలు వెంటనే గద్దెదించాలి కార్పోరేట్ సంస్థలకు దోచి పెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచారు 2024 లో కేంద్రంలో BJP ప్రభ్యత్వం పతనం ఖాయం.సందర్భంగా పలువురు BRS నాయకులు మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి బదులు ప్రజలపై నానా భారాలు మోపుతోందన్నారు.కేంద్ర ప్రభుత్వం అత్యవసరమైన గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజలపై భారం మోపిందన్నారు.  2014 వ సంవత్సరంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు.గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ప్రతి రంగంలోనూ అద్భుతంగా అభివృద్ధి చెందుతుండగా,కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల దేశ భవిష్యత్తు అధోగతి పాలైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదని, కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రత్యేక ప్రభుత్వమన్నారు.  దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర విధానాలైన నోట్ల రద్దు, జీఎస్టీ, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో  ప్రజలు నిత్యజీవితంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.గతఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిన తీరు దేశంలో ఎక్కడా కనిపించలేదన్నారు.కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలు, దూరదృష్టి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నందున రానున్న కాలంలో కేసీఆర్‌ ప్రధాని కావడం ఖాయమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే భారతదేశం మొత్తం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలియజేశారు.

తాజావార్తలు