గ్రామంలో ఇంటింటికి స్ప్రే చేసిన వైద్య బృందం

మండల పరిధిలోని నేతువానిపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి స్ప్రే చేశారు.గ్రామంలో ఐదు రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం గ్రామంలోని  హెల్త్ క్యాంపు,ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా గ్రామపంచాయతీ సిబ్బందితో సర్పంచ్ వీరేష్ నాయక్ శుభ్రం చేయించారు.దోమలు రాకుండా పిచికారిచేశారు.రోడ్లన్నీ శుభ్రపరచి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.గ్రామంలో ప్రజలకు  ఎలాంటి జ్వరాలు టైఫాయిడ్ మలేరియా ,డెంగు జ్వరాలు రాకుండగా తగు చర్యలు తీసుకుంటున్నారు.గ్రామంలో సర్పంచ్ పై కొంతమంది గిట్టని వారు గ్రామంలోని లేనిపోని ఆరోపణలు చేయడం సరైనది కాదు.జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ఇర్షాద్ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి రిజ్వాన్, వైద్య సిబ్బంది ఏఎన్ఎం,ఆశ వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు  ఇంటింటికి తిరిగి పిచికారి  చేశారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, హెల్త్ అసిస్టెంట్ జయరాములు,హెల్త్ సబ్ ఇన్స్టిట్యూట్ ఆఫీసర్ కృష్ణ, శివన్న ,ఏఎన్ఎంరాణి,ఆశ వర్కర్లు వరలక్ష్మి ,పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి,ఉపసర్పంచ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.