గ్రామంలో ఎలుగుబంటి హలచల్‌

సిద్దిపేట,జూన్‌26(జ‌నం సాక్షి): సిద్దిపేట జిల్లా మద్దూర్‌ మండలం లద్నూర్‌ గ్రామంలోకి చొరబడ్డ ఓ  ఎలుగుబంటి కలకలం రేపింది. ప్రజలను భయభ్రాంతుకలు గురి చేసింది. అనుకున్నట్లుగానే ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామానికి చెందిన  కసల్ల యాదగిరి విూద దాడి చేసి గాయపరిచింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చివరకు గ్రామస్తులు దాని వెంటపడి అడవిలోకి తరిమారు. వ్యవసాయ బావుల దగ్గర ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీనిపై అటవీ అధికారికి సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు.