గ్రామకంఠం ఆస్తులకుచట్టబద్ధత కల్పిస్తాం
తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 20:: గ్రామకంఠం ఆస్తుల చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద యావపూర్ గ్రామాన్ని తీసుకొని మీ ఆస్తులకు చట్టబద్ధ హక్కులు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు పేర్కొన్నారు మండలంలోని యాబపూర్ గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయతర ఆస్తులకు యాజమాన్య హక్కులు ఇప్పటివరకు లేవని దీనివల్ల ఇంటి పేరు రుణం గాని ఆస్తులకు చట్టబద్ధత గాని క్రమ కంఠం సంబంధించిన వివరాలు రికార్డులు లేవని అలాంటి రికార్డులను రౌండ్ కెమెరా ద్వారా మూడు సార్లు సర్వే చేయించి గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రతి స్థలంలో పర్యటించి వాటి కొలతల వివరాలు తీసుకొని చట్టబద్ధత కల్పించడానికి ఆస్తుల పట్టిక ప్రతి ఇంటి యజమానికి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు దానిపై ఏమైనా ఫిర్యాదులు ఉన్న కొలతలపై సందేహాలు ఉన్న వాటిని 15 రోజుల్లో పూర్తి చేసి నెల రోజుల లోపు చట్టబద్ధహక్కు కల్పించడానికి పాస్బుక్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు పాసుబుక్కులో ఎవరైనా కొంత స్థలం అమ్మిన వెంటనే దాని రికార్డు చేసి కొన్ని వ్యక్తికి హక్కు కల్పిస్తామని తెలిపార గత రెండు నెలల క్రితం మండలంలోని యావపూర్ గ్రామన్ని సి ఎం ఓ. స్మితా సబర్వాల్ సందర్శించి గడపగడపకు కలియతిరిగి వ్యవసాయేతర ఆస్తులకు పాసుబుక్కు ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని కార్యచరణకు గ్రామంలోని ప్రజల నుండి సానుకూలత అభిప్రాయం రావడంతో కార్యాచరణ మొదలుపెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ కంఠంలో ఒక కుటుంబానికి ఎన్ని ఇండ్లు ఎంత ఖాళీ స్థలం ఉన్నదో దానిని సర్వే చేయించి ్రామంలోని కాళీ స్థలాలకు కొలతలు వేసి సర్వే నిర్వహించి ఒక జాబితాను తయారు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులకు యాజమాన్యపు హక్కు కల్పించడం కొరకు గత రెండు నెలల నుండి పైలట్ సర్వే నిర్వహించడం జరిగింది. కార్యచరణ సర్వేలో ఏవైనా లోపాలు ఉంటే ఇంకా 15 రోజుల వరకు గడువును పెంచడం జరిగిందని ఏవైనా ఇబ్బందులు ఉన్నచో గ్రామ సెక్రెటరీకి గ్రామ ప్రజలు లొసుగులను తెలియజేయాలని వారి సందర్భంగా పేర్కొన్నారు. ఇది విజయవంతమైనటైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి సర్వేను అధికారికంగా చేపట్టే అవకాశం ఉందని వారి సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ డిపిఓ. తరుణ్ గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి, మండల అధ్యక్షులు బాబుల్ రెడ్డి, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|