గ్రామస్తుల రాస్తారోకో: పోలీసుల లాఠీచార్జ్‌

మెదక్‌,(జనంసాక్షి): చేగుంటను నగర పంచాయితీగా మార్చొద్దంటూ వడియారం హైవేపై గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోకు దిగిన గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.