గ్రామాలకు నిదులిచ్చి మోడీ రావాలి

సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు
సైదాపూర్, జనం సాక్షి నవంబర్ 10
గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలని మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి, లస్మన్నపల్లి సర్పంచ్ కాయిత రాములు డిమాండ్ చేశారు. ఆయన గురువారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ..
తెలంగాణ గ్రామీణ అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. తెలంగాణ గ్రామ పంచాయతీలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గ్రామపంచాయతీలో డబ్బులు లేక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆర్థిక భారం మోయలేక సర్పంచులు తలలు పట్టుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొందరు సర్పంచులు ఆర్థిక భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్షపూరిత, వివక్షపూరిత, పక్షపాత ధోరణిని విడనాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మతతత్వ ధోరణి విడనాడి దేశ ఐక్యతను, బహుళత్వాన్ని కాపాడుకునే విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.