గ్రామాల్లో పారిశుద్యానికి ప్రాధాన్యం

కరీంనగర్‌,ఫిబ్రవరి26 (ఆర్‌ఎన్‌ఎ):ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అందిస్తున్న ట్రాక్టర్లు సద్వినియోగం చేసుకుంటూ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయితీ అధికాఉఉల అన్నారు. నూతన పంచాయతీ చట్టాన్ని అనుసరించి సర్పంచ్‌ లు విధివిధానాల రూపకల్పనకు దోహదప డాలని చెప్పారు. ఎలాంటి అవకతవలకు తావులేకుండా నిక్కచ్చిగా పనిచేయాలని సూచించారు. గ్రామనర్సరీల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్నిచోట్ల మొక్కలుపెంచడంలో నిర్లక్ష్యంవహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని, బాధ్యతాయూతంగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం కొన్నేళ్లనుంచి ప్రతి ష్టాత్మకంగా తీసుకొని హరితహారాన్ని ప్రారంభించగా అవికొంతమేరకు సఫలీకృతమయ్యాయని, ఏగ్రామంలో చూసినా హరితహారంమొక్కలు పచ్చదనాన్ని వెదజల్లాలని చెప్పారు. అందరంకలిసి కట్టుగా పని చేస్తే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.