గ్రామాల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం – గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం


– గ్రామాల సమగ్ర అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం
– ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు బహూకరణ – గ్రామ పంచాయితీ సర్పంచులకు, సిబ్బందికి సన్మానం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిహుజూర్ నగర్ మార్చి 24 (జనంసాక్షి): గ్రామాల అభివృద్ధితోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని, జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పరిధిలోనిలోని గిరిజన బంజారా భవన్ లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామపంచాయతీ సర్పంచులకు, సిబ్బందికి అవార్డులు పంపిణీ చేసి సన్మానం చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత పాలకుల కాలంలో గ్రామాలు వెనుకబడిపోయాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల ముఖ చిత్రాలను మార్చివేసిందన్నారు. గ్రామ పంచాయతీలకు నెల నెల నిధులు మంజూరు చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నేడు గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందాయి అన్నారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్తు, ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్యం వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. గ్రామాలు అభివృద్ధిలో పోటీపడాలన్నారు. అభివృద్ధి చెందిన గ్రామపంచాయతీలను గుర్తించి ప్రభుత్వం అవార్డులు అందజేస్తుందన్నారు. అవార్డు పొందిన గ్రామపంచాయతీలకు మరిన్ని నిధులు వస్తాయన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామపంచాయతీలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, అధికారులు, పంచాయతీరాజ్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.