గ్రామాల సుందరీకరణ కు పల్లె ప్రగతి తోడ్పాటు

లోకేశ్వరం (జనం సాక్షి) గ్రామాల సుందరీకరణ కు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్అలీ ఫరూకీ అన్నారు ఐదో విడత పల్లె ప్రగతి  కార్యక్రమంలో భాగంగా మండలంలోని హావర్గా గ్రామాన్ని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ ఖండే తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా  పాలనాధికారి మాట్లాడుతూ   రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆయన సూచించారు గ్రామంలో ఎప్పటికప్పుడు డ్రైనేజీ వ్యవస్థ తో పాటు వీధి దీపాలు హరితహారం  కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణ బాధ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన దేనని లేనియెడల చర్యలు తప్పవని ఆయన అన్నారు గ్రామ సర్పంచ్ భుజంగరావు తో కలిసి  డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక పల్లె ప్రకృతి వనాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు పాలనాధికారి వెంట ఎంపీడీవో దేవేందర్ రెడ్డి మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు సాయి రెడ్డి పంచాయతీ కార్యదర్శి ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫరూకీ