గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ

కొండపల్లి నవంబర్ 18 జనం సాక్షి న్యూస్ :
పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే గ్రామీణ కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కోరారు.శుక్రవారం డిండి మండలం రహమంతా పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ILO _AITUC ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి ఉత్పత్తి ఉందని అన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశంలో 25 శాతం ఉత్పత్తి అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్తి ఉత్పత్తిలో దాదాపు 6 కోట్ల మంది రైతులు 10 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రత్తి పంట ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు ప్రతి ఉత్పత్తిలో భాగస్వామ్యమైన సన్న మధ్య రైతులకు, వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత, కార్మిక చట్టాలు అమలు కోసం ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) కృషి చేస్తుందని అన్నారు. కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు ,శ్రమకు తగ్గ వేతనాలు పెంచాలనీ కోరే హక్కు ఉంటుందని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడడం కోసం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం కోసం ,స్త్రీ పురుష వేతనాల వ్యత్యాస నివారణ కోసం, పని ప్రదేశాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు, రక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. పిల్లలను బడికి పంపాలని పనిలో పెట్టుకోవడం చట్టరిత్యా నేరమని పేర్కొన్నారు.అసంగటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. గ్రామీణ కార్మికులకు భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ నియోజక వర్గ అద్యక్షులు నూనె వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచి తూము వెంకట్ రెడ్డి, జన్ సహాస్ సంస్థ రాష్ట్ర నాయకులు, డి రాకేష్, ప్రకాశ్,రవి,విజయ్, సందీప్, గ్రామంలోని కార్మికులకు ఈ శ్రమ్ కార్డు ఇవ్వడం జరిగింది. కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా వస్తుందని, అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయలు వస్తాయని పేర్కొన్నారు.గ్రామ కోఆర్డినేటర్ శ్రీనివాస్, హనుమంత్,రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు