గ్రామీణ ఖర్చులకే ఆయుర్వేద కార్పొరేట్ వైద్యంగ్రామీణ ఖర్చులకే ఆయుర్వేద కార్పొరేట్ వైద్యం

బోధిధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితి సేవలు
ఉచిత పౌర్ణమి పాయాస పంపిణీ కార్యక్రమం పెద్ద సంఖ్యలో ప్రజలు


మిర్యాలగూడ, జనం సాక్షి :గ్రామీణ ఖర్చులకే కార్పొరేట్  ఆయుర్వేద  వైద్య సేవలు మిర్యాలగూడలో అందిస్తున్నారని పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ పేర్కొన్నారు. బుధవారంనల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో గల వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో బోధిధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితి డాక్టర్  పండిత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచితంగా సర్వరోగ నివారిణి పౌర్ణమి పాయాస పంపిణీ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం శ్రీధర్ స్వామీజీ పాయస పంపిణీ కార్యక్రమానికి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయుర్వేదరత్న, ఆయుర్వేద సామ్రాట్, ఆయుర్వేద విభూషణ్ అవార్డుల గ్రహీత డాక్టర్ పండిత్ శ్రీనివాస్ మాట్లాడుతూ 12 రాష్ట్రాల్లోని అనువంశిక ఆయుర్వేద వైద్యులచే తయారు చేయబడిన అద్భుత  ఔషధాలతో ఆయుర్వేద సేవలను మిర్యాలగూడలో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి కంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడునని తెలిపారు. కంటి శుక్లాలు ఆపరేషన్ లేకుండా చుక్కల మందుతో కరిగించబడునని పేర్కొన్నారు. బోధి ధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితిలో లభించు సేవల గురించి ఆయన వివరిస్తూ పక్షవాతం, మోకాళ్ళ నొప్పులు, ఆపరేషన్ లేని సేవలు, సంతానం లేని దంపతులకు, క్యాన్సర్, సెక్స్ సమస్యలు, మైగ్రేన్ పెయిన్, ఫిట్స్, షుగర్ థైరాయిడ్ లకు పూర్తి చికిత్స కలదని పేర్కొన్నారు. ఉచితంగా పౌర్ణమి పాయాస కార్యక్రమం లో పాయాసాన్ని తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా,  జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మునీర్, కర్నాటి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.