గ్రామ పంచాయతీల అభివృద్దే దేశ అభివృద్ధి
మండల సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి
పానుగల్ అక్టోబర్21,జనంసాక్షి
గ్రామ పంచాయతీల అభివృద్దే దేశ అభివృద్ధియని జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి అన్నారు.శుక్రవారం పానుగల్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం అందించే పంచాయతీరాజ్ అవార్డులలో మన రాష్ట్ర గ్రామపంచాయతీలకే అత్యధిక అవార్డులు వస్తాయని ఆకాంక్షించారు.70 శాతం నిధులు వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కోరార .ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, మండలాన్ని అభివృద్ధి దిశగా ముందంజలో నిలపాలని కోరారు. గ్రామాలలో నెలకొన్న పలు సమస్యలను ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకురాగా,సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని,ప్రజా,రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.గ్రామ స్థాయిలో గత 4 నెలల నుండి నిధుల మంజూరు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు సర్పంచులు తెలిపారు. సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచులు నేలపై కూర్చొని నిరసన తెలిపి, వినతి పత్రాన్ని జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డికి అందించారు. మాందాపూర్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపా ద్యాయుడిని డిప్యూటేషన్ పై రేవల్లి పాఠశాలకు పంపించడాని విరమిచుకోవలని గ్రామ ఎంపిటిసి భాస్కర్ రెడ్డి కోరారు.మండల మహిళ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో మండల,గ్రామ ప్రజా ప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండా మండల,గ్రామ కమిటీలు వేశారని అట్టి కమిటీలను రద్దు చేసి,నూతన కమిటీలను ఏర్పాటు చెయ్యాలని ఏ పి యం ని బదిలీ చెయ్యాలని ప్రజాప్రతినిధులు సభా దృష్టికి తెచ్చారు. విద్యుత్ శాఖ ఏఈ పనితీరుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఎస్ఐ నాగన్న ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పోలీస్ అమరవీరులకు సంతాపం తెలియజేశారు.ఈ సమావేశంలో, డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి,వైస్ ఎంపీపీ కవిత దశరథ్ నాయుడు,ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి,తహసీల్దార్ యేసయ్య,ఎస్ఐ నాగన్న,ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.