గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలకు 18 వేల వేతనం ఇవ్వాలి: నెమలి నర్సయ్య

ములుగు,ఫిబ్రవరి10(జనం సాక్షి):-
గ్రామ పంచాయితీలో పని చేయుచున్న పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, యన్ఎంఆర్/ఎంపిడబ్ల్యులకు నెలకు రూ. 18 వేల వేతనాలు చెల్లించాలని మహాజన ఉద్యోగ సమాఖ్య వ్యవస్థాపక కో ఆర్డినేటర్ నెమలి నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని గోవిందరావుపేట గ్రామ పంచాయితీలో మండల ప్రధాన కార్యదర్శి దుస్స సతీష్ అధ్యక్షతన కార్యాచరణ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి నెమలి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ లలో పనిచేస్తున్న అన్ని తరగతుల ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఆయన అన్నారు. పార్ట్ టైం ఎన్ఎంఆర్/ఎంపిడబ్ల్యులకు నెలకొక్కటికి రూ.18 వేల వేతనం చెల్లించాలని,ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదవి విరమణ పొందిన పంచాయతీ విభాగ ఖాళీ పోస్టులలో అర్హత కలిగిన కారొబార్,బిల్ కలెక్టర్, పంప్ మెకానిక్,కంప్యూటర్ ఆపరేటర్ నాల్గవ తరగతి ఉద్యోగులతో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యాచరణలో భాగంగా ఈ నెల 11న సర్పంచ్ ఉప సర్పంచ్,పంచాయతీ కార్యదర్శులకు 14న ఎంపిఓ ఎంపిడిఓల కు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనే యుద్ధ భూమిలో ప్రతి పారిశుద్ధ్య కార్మికులు,పంచాయతీ అన్ని కెటగిరిల ఉద్యోగులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కో ఇంచార్జ్ దొంగరి ఉప్పలయ్య,ములుగు డివిజన్ మహిళ,ఉద్యోగుల ఇంచార్జ్ నవుడూరి విజయలక్ష్మి, అలెగ్జాండర్ యాస సంజీవరెడ్డి, కోగిల ఈశ్వరి,సప్పిడి నర్సమ్మ,బోధ సుమన్ తదితరులుపాల్గొన్నారు.