గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచి,ఉద్యోగ భద్రత కల్పించాలి…

-ఐఎఫ్టీయ్యూ జిల్లా అధ్యక్షులు గంజపెట్ రాజు
జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇఫ్ట్ కార్యాలయంలో “తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ఇఫ్ట్ జిల్లా సహాయ కార్యదర్శి యం.నర్సింహులు అధ్యక్షత వహించగా గంజిపేట రాజు హాజరై మాట్లాడుతూ..* తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న పారిశుద్ధ్యం,నర్సరీలు,వాటర్ మెన్,వీధి దీపాల నిర్వాహణ, పన్నులు వసూలు చేయుట,ఆఫిసు నిర్వహణ తదితర పనులలో వివిధ కేటగిరీల క్రింద పని చేస్తున్న సిబ్బంది వేతనాలను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దళిత ఎంపవర్ మెంట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచి వారికి పీఆర్ సీ తరహాలో నిర్ణయాత్మకమైన ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారని, కావున ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకు  వచ్చేందుకు వెంటనే జీ.వో జారీ చేయాలని డిమైండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల గ్రామ పంచాయతీ కార్మికులకు కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో పనిచేస్తున్న కార్మికులకు అదే విధంగానే వర్తింపచేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పిఆర్సి  ఆధారంగా వెంటనే కార్మికులకు వేతనాలు పెంచి కేటగిరీల వారీగా వేతనాలను చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు,కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచి జీఓలను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు,ప్రభుత్వం జీ.ఓ.జారీచేసి చేతులు దులుపుకొని వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు.ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం పునఃపరిశీలన చేసి పంచాయతీ వర్కర్ల కు  కార్మికులకు 30 శాతం పీఆర్సీ  ప్రకారం జీతాలు,మల్టీపర్పస్ రద్దు చేయాలని కేటగిరీల వారిగా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు,రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు విడుదల చేసిన జీవోలు అన్ని అమలు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని అన్నారు.జీవో నెంబర్ 51 ప్రకారం ₹ 8500/- రూపాయలు జిల్లావ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీలో అమలు కావడం లేదన్నారు.గ్రామపంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు.వేతనాలు పెండింగ్లో ఉండటం వలన కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు కడుపులో కాలుతూ జీతం చేస్తుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కార్మికులను తీసుకోవాలనే నిబంధనను అధికారులు తుంగలో తొక్కారు అన్నారు. ప్రతి సంవత్సరం గ్రామపంచాయతీ కార్మికులకు రెండు జతల బట్టలు,సబ్బులు, నూనెలు ఇవ్వాలని ఉన్నా ఇవ్వడం లేదన్నారు.రెండు లక్షల జీవిత బీమా ప్రతి కార్మికునికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యూనిట్ గా తీసుకొని కార్మికులందరికీ ఈఎస్ఐ,పీఎఫ్ అమలు చేయాలన్నారు.నూతనంగా అధికారంలోకి వచ్చిన సర్పంచులు,ఎంపీటీసీలు తమకు అనుకూలమైన మనుషులను గ్రామ పంచాయతీలలో నియమించుకున్నారు.ఎలాంటి కారణాలు లేకున్నా అక్రమంగా కార్మికులను తొలగించారు.అలా తొలగించిన కార్మికులందరినీ తిరిగి నియమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో వివిధ గ్రామ పంచాయతీ కార్మికులు అసలు నర్సింహులు, రాములు,బుజమ్మ,అంజి,పంటయ్య,రాజు,రంగస్వామి,నర్సింహులు,అలిసాబ్,జయన్న,నల్లాస్వామి, రాముడు,హనుమంతు,పెద్ద కిష్టప్ప,తదితరులు ఉన్నారు*
Attachments area