గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, కేటగిరి వైజ్ గా రెగ్యులర్ చేయాలి – అసెంబ్లీ లో గళమెత్తిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు


జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్రములో గ్రామ పంచాయితీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా సమ్మె చెయ్యడం జరుగుతున్నదని వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో శనివారం గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలపై గళమెత్తారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్స్, సఫాయి కార్మికుల మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి కేటగిరి వైజ్ గా రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం
ఇవ్వాలని అని మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరారు.

తాజావార్తలు