గ్రూప్ – 1 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బే షరతుగా క్షమాపణ చెప్పాలి

జనంసాక్షి , మంథని : గ్రూప్ – 1 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బే షరతుగా క్షమాపణ చెప్పాలని మంథని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మంథని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణలోని నిరుద్యోగులు అందర్నీ ఉద్యమ బాట పట్టించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంక గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అనే సంకల్పంతో తెలంగాణలో టీఎస్పీఎస్సీ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడం జరిగిందని అయితే మొన్నటికి మొన్న జరిగిన గ్రూప్ వన్ పరీక్షలలో బయోమెట్రిక్ విధానం లేకపోవడం ఓ ఎం ఆర్ షీట్ పైన హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం మూలాన నిరుద్యోగులకు అనుమానం వచ్చి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని ఈ గ్రూప్ వన్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ అయిందని అనుమానంతో ఉన్నత న్యాయస్థానం గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలోని వివిధ గ్రామాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాతనే మా గ్రామంలో అడుగుపెడతాను అనే సంకల్పంతో హైదరాబాద్ కరీంనగర్ లాంటి నగరాలలో ఉంటూ వేలాది లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లకు వెచ్చించి కోచింగ్ తీసుకొని రాత్రింబవళ్లు నిద్రలు మాని గ్రూప్ వన్ పరీక్షలు రాస్తే ఆ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నియామక వ్యవస్థ నిర్వాకం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తక్షణమే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ లోపానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి గ్రూప్ వన్ పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ బిజెపి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని, అంతే కాకుండా ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగుల పాలిట ఈ కేసీఆర్ ప్రభుత్వం రాక్షస క్రీడలు ఆడుతుందని రానున్న ఎన్నికల్లో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని ఈ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని లేకపోతే మన నిరుద్యోగులు బిచ్చం ఎత్తుకునే పరిస్థితికి దాపరించే స్థితి వరకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వస్తాడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ టిఎస్పిఎస్సి నిర్వాకం వల్ల నిర్వహణ లోపం వల్ల ఉద్యోగాలు ఇప్పటివరకు కేవలం 50 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని తక్షణమే ఉద్యోగాల నియామక ప్రక్రియ వ్యవహారం టీఎస్పీఎస్సీని రద్దుచేసి నియామకాల ప్రక్రియ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రదర్శించుకోవాలని ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాం ఈ విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షుడు బుడిదా తిరుపతి, మండల ఇంచార్జ్ తోట మదుకర్ , ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుడిదా రాజు, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు, ఎండి శరీఫుద్దీన్, పట్టణ ఉపాధ్యక్షుడు గురువేష్ ,సీనియర్ నాయకుడు కొరవేన మల్లికార్జున్ , భూత్ అధ్యక్షుడు కపడం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.