గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయాలి:శ్రీమతి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్.

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ… ఈ నెల 16న నిర్వహించబోయే గ్రూప్ -1 పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేసి జనాలు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉండే జిరాక్స్ షాపులు, ఇతరత్రా వాటిని ముందుగానే మూసి ఉంచేలా దుకాణదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులు,కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించకూడదని తెలియజేసారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో ఉండాలని మెదక్ జిల్లాలో 3312 మంది గ్రూప్ -1 అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో మొత్తం 07 (BVRIT నర్సాపూర్-01, మెదక్ పట్టణంలో -04, తూప్రాన్-02) పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఈ పరీక్షలు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫర్నిచర్, గాలి, వెలుతురు, నీటి వసతి ఏర్పాటు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని,పరీక్షకు సంబంధించిన నిబంధనలు పూర్తిగా హాల్ టికెట్లో పొందపరచి ఉంటాయని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు హాల్ టికెట్ లోని నిబంధనలు చదువుకోవడం మర్చిపోవద్దని, అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరనీ, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, సెల్ ఫోన్లు, వాచ్ లు (చేతి గడియారాలు) ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలగునవి ఎవరు తీసుకురాకూడదని తెలిపారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా అమలు చేయబడతాయని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రం చుట్టూ 360 డిగ్రీలలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లోనికి అభ్యర్థులు చీప్ సూపర్డెంట్ లకు, అబ్జర్వర్లకు,బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు,మరియు ఇన్విజిలేటర్లకు మాత్రమే అనుమతి ఉందని అన్నారు.