గ్రేటర్‌ కరీంనగర్‌కు మళ్లీ ప్రాణం

సవిూప గ్రామాల విలీనం కోసం కసరత్తు
కరీంనగర్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాల విభజన పక్రియ పూర్తి కావడంతో కొత్త జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న నగరపంచాతీయలకు ¬దా కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా కావడంతో నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీ ¬దాను కల్పించారు. ఆయా జిల్లాల పరిధిలో మరికొన్ని మండల కేంద్రాలను పట్టణాలుగా మార్చనున్నారు. దీంతో పాటే కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చుట్టు ఉన్న జిల్లాలకు కేంద్ర బిందువు కానుంది. అదేవిధంగా ప్రభుత్వం స్మార్ట్‌సిటీ ¬దా
కల్పిస్తుండటం..నిధులకు ఏమాత్రం కొరత రాకుండా సౌకర్యాల కల్పనకు సిద్ధం అవుతుండటంతో నగరపాలక స్థాయీ నుంచి గ్రేటర్‌ కరీంనగర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 31జిల్లాలో హైదరాబాద్‌ మినహాయిస్తే వరంగల్‌ ఒక్కటే గ్రేటర్‌ కార్పొరేషన్‌ ¬దా కలిగి ఉంది.నగరానికి ఆనుకొని ఉన్న శివారు గ్రామపంచాయతీల విలీనం మళ్లీ తెరపైకి వస్తోంది. నగరానికి ఆనుకొని ఉన్న 10 గ్రామాలను నగర పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఇటీవల కరీంనగర్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. వీటి పరిధిలో ఎట్టి పరిస్థితిలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించరాదని, మరోమారు గ్రామాలను విలీనం చేసేందుకు నగరపాలక పాలకవర్గం తీర్మానించి పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా తాగునీటి పైపులైన్లు విస్తరించాలని, ఆయా గ్రామాలకు తాగునీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికలనాటికి గ్రామాలను నగరపరిధిలోకి తెచ్చే అవకాశాలే అధికంగా కన్పిస్తున్నాయి. వీటన్నింటిని నగరపాలక పరిధిలోకి కలుపాలని పలుమార్లు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ గతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ ప్రతిపాదనలకు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే నగరపాలక సంస్థ ¬దా కల్పించినప్పుడే.. ఆ గ్రామాలను నగరంలోకి విలీనం చేయాల్సింది..తాజాగా గ్రేటర్‌ కరీంనగర్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివారు గ్రామాల విలీనం తప్పనిసరిగా మారిందనే సాంకేతాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దీనిపై ప్రస్తావించినట్లు సమాచారం. కరీంనగర్‌ మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థ ¬దాను 2005 సంవత్సరంలో కల్పించారు. ఆ సమయంలో నగరానికి ఆనుకొని ఉన్న 10గ్రామాలను విలీనం చేయాలని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు ఈ విలీన ప్రతిపాదనను అడ్డుకోవడం, న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అప్పట్లో వాయిదా పడింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీల పాలకవర్గ కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించడం..ఈ విషయాన్ని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు వివరించడం..కొందరు న్యాయస్థానం ద్వారా అడ్డుకోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో పడింది.నగరానికి ఆనుకొని ఉన్న 10గ్రామాలను నగరపాలక పరిధిలోకి విలీనం చేయాలని అప్పటి ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌తో పాటు పాలకవర్గం సైతం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. అదేవిధంగా గత గ్రామపంచాయతీ ఎన్నికల ముందు గ్రామ కార్యదర్శులతో తీర్మాణాలు చేయించి ప్రభుత్వానికి చేరవేశారు. అయినప్పటికి జనాభా ప్రాతిపదికన విలీనం చేయాలని 2011సంవత్సరంలో నిర్ణయించినప్పటికి..తీరా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగడం..గ్రామ పాలకవర్గాలు రావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది.