గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్బంగా పిల్లలకు అవగాహన

ఖానాపురం అక్టోబర్15జనం సాక్షి
గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్బంగా ఐసీడీఎస్ అధ్వర్యంలో ధర్మారావుపేట గ్రామంలో సర్పంచ్ వెన్ను.శృతి పూర్ణచందర్ ఆధ్వర్యంలో  ప్రైమరీ స్కూల్ పిల్లల కు అవగాహన కల్పించారు . గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్బంగాపిల్లలకు చేతులు శుభ్రంగా చేయడానికి తొమ్మిది దశ లను అనుసరించి కనీసం 20 సెకండ్ లా పాటు సబ్బు తో కడగాలని  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూప్రతి రోజు భోజనం సమయంముందు, వాష్ రూమ్ వెళ్లి వచ్చిన తర్వాతచేతులు శుభ్రంగా కడుక్కోవాలి విద్యార్థులకు అవగాహన కల్పించారు.మనంఆరోగ్యంగా ఉండాలంటే మన చేతులు శుభ్రంగా ఉండాలనిఅన్నారు. చేతులు శుభ్రంగా లేకపోతే వాటికి ఉండే క్రిములు, బ్యాక్టీరియా వైరస్లు మనం తినే ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్తాయి అన్నారు.అంగన్వాడీ టీచర్స్ రాణి,ఐలమ్మ,మంజుల, శాంతమ్మ, ఏఎన్ఎంలు  ,ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area