ఘట్కేసర్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక

ఘట్కేసర్ సెప్టెంబర్ 17 జనం సాక్షి శనివారం రోజు 75వ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం మరియు వజ్రోత్సవలల్లో భాగంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

ఈ సందర్భంగా చైర్పరన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు, అనేది రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమం. సెప్టెంబరు 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ 2022 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో మూడురోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలనూ, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో ముగింపు వేడుకలనూ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ పిలుపునిచ్చారాణి,
హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దాన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు, 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు, ప్రజా పోరాటాలు జరిగాయి. 1948లో ఉద్యమం ఉధృత రూపం దాల్చి చివరికి నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్య (ఆపరేషన్ పోలో)తో నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో 1948 సెప్టెంబరు 17న లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడాని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ శ్రీమతి వసంత, కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి , కొమ్మగోని రమాదేవి మహిపల్ గౌడ్ , బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్ , కడుపొల్ల మల్లేష్ , జహంగీర్ , బేతల నర్సింగ్ రావు , కో-ఆప్షన్ సభ్యులు షౌకత్ , బొక్క సురేందర్ రెడ్డి , ఘట్కేసర్ మున్సిపల్ తెరాస పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్, గట్టు మైసమ్మ ఆలయ డైరెక్టర్ బొక్క జాంగా రెడ్డి , మున్సిపల్ మేనేజర్ అంజి రెడ్డి , మునిసిపల్ అధికారులు హేమంత్ , సాయి కుమార్ , తదితరులు పాల్గొన్నారు.