*ఘనంగా అంగన్వాడి బడిబాట.
చిట్యాల7(జనంసాక్షి) మండల కేంద్రంలో అంగన్వాడి నెంబర్ వన్ సెంటర్ పరిధిలో గల రాంనగర్ లో మంగళవారం అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో అంగన్వాడి బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎంపిపి దావు వినోద వీరా రెడ్డి జెండా ఊపి బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె ఈసందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సెంటర్ల నుంచి అందే పౌష్టికాహారం పిల్లలకు తల్లులకు వరమని అన్నారు. పిల్లలు తల్లులకు సరైన పోషకాహారం అందాలంటే అంగన్వాడి సెంటర్ కు సంబంధించిన సమతుల్య ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ సూపర్ వైజర్ జయప్రద మాట్లాడుతూ రెండు సంవత్సరాలు దాటిన పిల్లలని అంగన్వాడి సెంటర్ కు పంపించాలని, గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడి సెంటర్ కు వచ్చి ఆహారాన్ని తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూర్ణచందర్, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, కో ఆప్షన్ సభ్యులు రాజ్ మహమ్మద్ వార్డు సభ్యులు గుర్రపు కోమల తిరుపతి,అంగన్వాడి టీచర్లు చింతల సంధ్యారాణి, భాగ్యలక్ష్మి, అరుణ, పుల్ల భాగ్యమ్మ,కనకం సుజాత, ఆస్పత్రి హెచ్ ఈ రేష్మ ఏఎన్ఎం సుమలత, ఆశ వర్కర్ విజయ, ఆయాలు,మహిళలు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.