ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు
ఖానాపురం అక్టోబర్ 15జనం సాక్షి
మండల కేంద్రంలో ని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ .ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ వేములపల్లి ప్రకాశం రావు హాజరయ్యారు.భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటం పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ లో కలామ్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుమనవాణి, సర్పంచులు ప్రవీణ్ కుమార్, ఐలయ్య, ఉప సర్పంచ్ మేడిద కుమార్,
మౌలానా,పోశెట్టి,బాలు నాయక్,పంచాయతీ కార్యదర్శులు,మండల ప్రజాపరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.