ఘనంగా అభయ అంజనేయ స్వామి విగ్ర ప్రతిష్టాపన

 

వీణవంక మార్చి 10 (జనం సాక్షి )వీణవంక మండలంలోని వల్బాపూర్ గత మూడు రోజుల నుండి గ్రామంలో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా శుక్రవారం రోజున అగ్నిహోమాలు, జలాభిషేకాలు, వేదపండితుల, మంత్రోచ్ఛరణల మధ్య అభయాంజనేయస్వామి వైభోగంగా కొలువుదీరారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో విగ్ర ప్రతిష్టాపన కొరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా వేదపండితుల మధ్య ప్రత్యేక పూజలతో శ్రీరామ జయరామ జయజయరామ అంటూ, అంజనేయస్వామి నామస్మరణతో గ్రామ వీధులు మారుమ్రోగాయి. వేలాది మంది
వీక్షిస్తుండగా స్వామి వారు తీరొక్క పూలతో అందంగా అలంకరించబడి, అంగరంగ వైభవంగా కొలువుదీరారు. విగ్రహ ప్రతిష్టాపనకు తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించాడు. అనంతరం విగ్రహ ప్రతిష్టకు వచ్చిన ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల సాదవరెడ్డి, వైస్ఎంపీపీ రాయిశెట్టి లత శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాల కిషన్ రావు లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మహానదన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు అన్నదాన కార్యక్రమానికి సింగల్ విండో డైరెక్టర్ కామీడీ కావ్య శ్రీనివాస్ రెడ్డి లు దాతలుగా ముందుకు వచ్చారు
గ్రామ సర్పంచ్ ఎక్కేటి రఘుపాల్ రెడ్డి. సింగిల్ విండో డైరెక్టర్ కామిడి కావ్య శ్రీనివాస్ రెడ్డిలకు
ఈ కార్యక్రమంలో అభయాంజనేయస్వామి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, వేదపండితులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.