ఘనంగా ఆంధ్ర అవతరణదినోత్సవం


జెండా ఆవిష్కరించిన సిఎం జగన్‌
పొట్టి శ్రీరాములుకు నివాలి అర్పించి సిఎం
శుభాకాక్షలు తెలిపిన ప్రధాని మోడీ
పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి నివాళి
అమరావతి,నవంబర్‌1  (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ సెక్రటరీ సవిూర్‌ శర్మ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేష్‌, శంకరనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, తానేటి వనిత, గుమ్మనూరి జయరాం, అవంతి శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలుగు అకాడవిూ చైర్మన్‌ లక్ష్మీ పార్వతి, మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్‌ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలు నైపుణ్యం, ధృడ సంకల్పం, పట్టుదలకు మారుపేరని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ’ఆంధప్రదేశ్‌లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అలాగే కర్ణాటక రాజ్యోత్సవం, కేరళ పిరవి ఉత్సవాల సందర్భంగా ప్రధాని ఆయా రాష్టాల్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా… విజయవాడలోని సామరంగ్‌చౌక్‌ లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన పోరాటాలను స్మరించుకున్నారు. సిఎంగా జగన్‌ వచ్చిన తరవాతనే మళ్లీ అవతరణ వేడుకలకు అవకావం ఏర్పడిరదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నివాళర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిరదన్నారు. మహనీయుడి స్పూర్తి కొనసాగాలనే సీఎం జగన్‌.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని టీడీపీ ప్రభుత్వం జరపలేదని..
అప్పట్లో వేడుకలు జరపకుండా ఇప్పుడు అచ్చెన్నాయుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు.