ఘనంగా ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జహీరాబాద్ సెప్టెంబర్ 27( జనం సాక్షి ) ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన జహీరాబాద్ పట్టణ పద్మశాలి సంఘం, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పట్టణ పద్మశాలి సంఘం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ పద్మశాలీలు ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని అన్నారు భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారికి బాపూజీ కొండంత అండగా ఉండేవారు నిజాం ప్రభుత్వం పోరాట యోధులకు అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే వారి పక్షాన కోర్టులో వాదించి జైలు నుండి విడిపించేవారు అన్యాయాన్ని అస్సలు సహీంచేవారు కాదు అన్నారు. బాపూజీ నిరుపేద కుటుంభం లో పుట్టి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు న్యాయవాది మాజీమంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తోలి తరం ఉద్యమ కారుడు తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రిపదవికి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం లోనే పదవులు చేపడతాను అని శపథం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతు పోరాడుతున్న వారికి అనేక రకాలుగా సహాయం చేశారు అన్నారు. కేసీఆర్ సమక్షంలో జరిగిన మలిదశ ఉద్యమానికి వేదిక గా హైదరాబాద్ లోని జలదృశ్యంలో తన స్వంత ఇల్లు ను ఇచ్చారు అప్పటి సమైక్యాంధ్ర పాలకులు దానిని కూల్చివేశారు తన జీవితకాలం మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసమే ఆలోచన చేశారు అని అన్నారు కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సలర్ పి. రాములునేత జహీరాబాద్ పట్టణ పద్మశాలీ సంఘం కార్యదర్శి కే.మనోహర్ కోశాధికారి జి.నాందేవ్ ఒగ్గు బండారి సుదర్శన్ డా.విఠల్ పల్లే.తుక్కరాం గుంజేటి విజయ్ గడ్డం పాండు మరెల్లి వెంకటయ్య సార్ కార్యవర్గ సభ్యులు బండారి సుధీర్ కనికుంట్ల నర్సిములు దోమల పండరి సగ్గం విజయ్ సగ్గం విఠల్ సగ్గం శ్రీనివాస్ పెగడ.శ్రీనివాస్ గద్దె వెంకటేషం కొపెరి లక్ష్మణ్ గుండ్ల మల్లయ్య జెట్ల.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.