ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మక్తల్ నవంబర్ 19 (జనంసాక్షి) ఇందిరాగాంధీ ప్రపంచంలోనే శక్తివంతమైన ఉక్కు మహిళగా అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా పనిచేశారని నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి కొనియాడారు. మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వాటర్ శ్రీహరి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన మహిళా శక్తిని దేశానికి చాటిన దీరురాలు శ్రీమతి ఇందిరా గాంధీ అని కొనియాడారు. భారతదేశానికి సుస్థిరత పాలన అందించి బడుగు బలహీన వర్గాల పాలిట దైవంగా మారి ఆదర్శవంతమైన పాలన అందించిన మహా నాయకురాలు అని అన్నారు. ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాగనూరు మండల అధ్యక్షుడు
అనంద్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు
గొల్లపల్లి నారాయణ, పట్టణ అధ్యక్షుడు ఏ .రవికుమార్, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ నూరుద్దీన్, బీసీ మండల అధ్యక్షుడు
కట్ట వెంకటేష్, కె .అంజప్ప, పెద్దింటి మల్లేష్, కున్సీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.