ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

జనం సాక్షి ఉట్నూర్.

ఉట్నూర్ మండల కేంద్రంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 38వ వర్ధంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాలవేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ జావిద్ మాట్లాడుతూ 1959 ఫిబ్రవరి 2న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం భారత దేశం తొలి మహిళ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించారు. గాంధీ సూత్రాలను అనుసరించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో పేద ప్రజల కోసం 20 సూత్రాల పతాకం రూపొందించి వెట్టి చాకిరి చట్ట విరుద్ధమని ప్రకటించిందని గరీబీ హటావ్ అనే నినాదం దేశంలో పేదరిక నిర్మూలన కోసం దీర్ఘకాలికా పతాకాలు ప్రవేశపెట్టి రోటి కపడా మకాన్ అందించి పేద ప్రజల గుండెల్లో నిలిచి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నత నాయకురాలు తొలి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నెదునూరి అశోక్ సతీష్ కైలాష్ యూనివర్స్ జావిద్ ఇర్షాద్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు

తాజావార్తలు