*ఘనంగా ఏరువాక పౌర్ణమి*

మేళ్లచెరువు  మండలం

వ్యవసాయం ఒక యజ్ఞం.. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.. పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు.
జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే ఈ రోజే రైతులు వ్యవసాయ పనులను ఆరంభిస్తూ భూమి పూజ చేస్తారు. జ్యేష్ఠ పూర్ణిమనే ఏరువార పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అని అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం.. భూమిని భూమాతగా కొలుస్తూఉంటాం.. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం.అలాంటి ఏరువాక కార్యక్రమాన్ని మండల కేంద్రంలో వందలాది నాగళ్ల తో ఊరేగింపుగా వెళ్లడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పందిరిపల్లి శంకర్ రెడ్డి వార్డ్ మెంబర్స్ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు