ఘనంగా “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు.
నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు.
జనం సాక్షి,నర్సంపేట
ఘనంగా “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు.నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు.
ప్రతి ఏటా జరుగునున్న ఈ “కళ్యాణ బతుకమ్మ” సంబరాలు. శనివారం 700 మందికి రూ. 7 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేయగా,నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 వేల కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో “కళ్యాణ బతుకమ్మ” వేడుకలు మన నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయమని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో కొత్తగా పెళ్లిళ్లయిన ఆడబిడ్డలందరినీ ఆహ్వానించి కళ్యాణలక్ష్మి ద్వారా లక్ష రూపాయలు పంపించి కళ్యాణ బతుకమ్మ కార్యక్రమం నిర్వహించుకోవడం దేశానికే ఆదర్శమని,భవిష్యత్తులో తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలలో “కళ్యాణ బతుకమ్మ”కు ఒకరోజు ప్రత్యేకంగా ఉంటుందని అది ఈ రోజే ప్రారంభమైందని, ఇది ఆడవారికి వారసత్వంగా కొనసాగుతుందని ఈ కల్యాణ బతుకమ్మ సందర్భంగా కోరుకుంటున్నానని,నర్సంపేట నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు విలువ చేసే 700 మందికి చెక్కులను “కళ్యాణ బతుకమ్మ” కార్యక్రమం ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన ఆడబిడ్డల తల్లులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఇప్పటివరకు నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు కేసిఆర్ గారు 10,000 పై చిలుకు మంది అక్క చెల్లెల్ల పెళ్లిలకు కట్నంగా కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ ద్వారా చెక్కులను అందచేయడం జరిగిందని,ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గంలోని ఆడబిడ్డలఅందరికి పేరుపేరునా బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది సప్న, జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని కిషన్,కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మ ప్రసాద్,తిరుమల సదానందం, పట్టణ టిఆర్ఎస్ రూరల్ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, వివిధ మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల నాయకురాలు, సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.