ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

  నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్27,జనంసాక్షి,,,   స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ,  తెలంగాణ విముక్తికి అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బాపూజీ 107 వ జయంతి అధికారిక  వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.అంతకుముందు కలెక్టర్ చౌక్ లో  బాపూజీ విగ్రహానికి మంత్రి, జిల్లా పాలనాదికారి ఘనంగా నివాళులర్పించారు.   మంత్రి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం   జరుగుతుందని    తెలంగాణ ఉద్యమ సమయంలో మర్రి చెన్నారెడ్డి తో కలసి తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారని. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయం గా వదులుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమం లోనూ బాపూజీ చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన బాపూజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  తెలంగాణ హార్టీ కల్చర్ యూనివర్సిటీ కి కూడా బాపూజీ పేరు పెట్టినట్లు తెలిపారు.
జిల్లా పాలనాధికారి  మాట్లాడుతూ
తెలంగాణ  ఉద్యమకారులకు  కొండంత అండగా నిలిచి స్ఫూర్తినిచ్చిన  ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. న్యాయవాదిగా, శాసన సభ్యుడిగా, మంత్రిగా ఆయన సేవలు మరువరానివని ప్రశంసించారు. అనంతరం  నీట్ లో JEE , గ్రూప్ 1లో ర్యాంక్ లు పొందిన విద్యార్థులను సన్మానించారు.
ఈ కార్యక్రమం లో   బిసి వెల్ఫర్   అధికారి  రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ రామేశ్వర్,  అధికారులు,ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.
Attachments area