ఘనంగా గోమాతకి బారసాల.

 

 

 

 

బెజ్జంకి,సెప్టెంబర్3,(జనంసాక్షి):మండల కేంద్రంలోని తోటపల్లి గ్రామంలో లక్ష్మీ ఇండస్ట్రీస్ రైస్ మిల్ నిర్వాహకులైన బుక్క బాల నారాయణ,శ్రీనివాస్ రైస్ మిల్లులో గల ఆవుకు గోమాత(లేగదూడ)జన్మించగా శనివారం గోమాతకు కన్నుల పండుగగా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా బారసాల(21) కార్యక్రమం నిర్వహించారు.బారసాల కార్యక్రమానికి వచ్చిన అతిథులు,ప్రజలు పిల్లలకు చేసినట్టుగా బారసాల నిర్వహించి విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన వారికి ఆనందంతో ఆశీర్వచనాలు అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు మాట్లాడుతూ గోమాతను పూజించుట మన సంస్కృతిలో  భాగమని,గోమాతకు బారసాల నిర్వహించడం తెలుగు సంస్కృతిని కూడా గౌరవించడం అని అన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు శ్రీరాములు,బోయినపల్లి అశోక్ రావు,బోయినపల్లి వెంకటరావు బోయినపల్లి ప్రభాకర్ రావు ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.