ఘనంగా జయముఖి ఫార్మసీ కళాశాల వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ వేడుకలు
జనం సాక్షి, చెన్నరావు పేట
September 29 వరల్డ్ హార్ట్ డే ని పురస్కరించుకొని జయముఖి ఫార్మసీ కళాశాల, శ్రీనివాసా హార్ట్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రజలకి సిపిఆర్ పైన అవగాహన కల్పించారు.
ప్రజల జీవనశైలిలో మార్పులు మరియు ఒత్తిడికి గురవడం వల్ల అరెస్టు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ రోజులలో ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్ట్ పై కింద పడి పోయినప్పుడు ప్రాథమిక చికిత్స అందడానికి అంటే ముందు అతని ప్రాణాన్ని కాపాడ్డానికి చేసే ప్రక్రియని మనము సిపిఎస్ అంటాము.శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ డాక్టర్ రమక శ్రీనివాస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పామిడి విద్యార్థిని విద్యార్థులు ద్వారా చేయవలసిన విధానమును తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.సి పి ఆర్ ఎలా చేయాలి, చేయవలసిన ప్రక్రియ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కలిగివున్న కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ వాసుదేవ మూర్తి, కళాశాల అధ్యాపకులు డాక్టర్ నిషాద్ ఫాతిమా,కల్పనా, శ్వేతా ల తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు