ఘనంగా జాతిపిత మహాత్మ గాంధీ 153 వ జయంతి వేడుకల.

– శాసనసభ్యులు పొదెం వీరయ్య, తోట దేవి ప్రసన్న ఆదేశాలతో…

– బూర్గంపహాడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో గాంధీ జయంతి వేడుకలు.

– సారపాక ప్రధాన కూడలిలో గాంధీ జయంతి వేడుక.

బూర్గంపహాడ్ అక్టోబర్ 02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, డిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బి బ్లాక్ మహిళా అధ్యక్షరాలు బర్ల నాగమణి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాంధీజీ నిరాడంబరుడు భారతదేశనికి స్వతంత్రం తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, ఎస్ కె యాకుబ్ పాషా, సీనియర్ నాయకులు బెల్లంకొండ వాసుదేవరావు, భాగి వెంకటరావు, యారం నాగిరెడ్డి, ఎండి వాజిద్, పాసిగంటి నాగ మురళి, పోలికొండ ప్రభాకర్, కువ్వారపు వెంకటేష్, ఎస్ టి సెల్ నాయకుడు నుపా సురేష్, లక్ష్మణరావు, ఎడంకంటి శ్రీనివాస్ రెడ్డి, మేడం వెంకటరెడ్డి, మండల మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మైపా మణి, ఆవుల వెంకట రమనమ్మ, కూలమల్ల వెంకట నరసమ్మ, మద్దిటి రమణ, పుట్టి లక్ష్మీ, గిరిజ తాయారమ్మ, సత్యనారాయణ, మహబూబ్ బాషా తోకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

– సారపాక ప్రధాన కూడలిలో…

మహాత్మ గాంధీ జీ జయంతి సందర్భంగా బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రధాన కూడలిలో గాంధీజీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ స్వాతంత్ర సాధనకై నాటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన గోఖలే తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మొదలైన వారితో ఉద్యమం ఆరంభించి, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా అనే అనేక ఉద్యమాలు చేసి, అనేకసార్లు జైలుకు వెళ్లి దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను లెక్కచేయని ఘనత గాంధీజీ దేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బెల్లంకొండ వాసు, నూప సురేష్, కనితి కృష్ణ, కారం శ్రావణ్, ఆర్ కృష్ణ, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.