ఘనంగా జాతీయ సమైక్య వారోత్సవాలు
రామారెడ్డి జనంసాక్షీ సెప్టెంబర్ 17 :
ఎవరి వాదనలో వారు సెప్టెంబర్ 17 న రామారెడ్డి మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాజకీయ పార్టీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ,
భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, కులాలు, తెగలు, భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం అని అన్నారు. దేశంలో ఉన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవని అన్నారు. ఈ వైవిధ్యాల వల్ల దేశంలో జాతీయ సమైక్యతతో కూడిన సమగ్ర అభివృద్ధిని సాధించడం పాలకులకు సవాలుగా మారిందని అన్నారు. దేశంలో సామాజిక నిర్మాణ మత, కుల ప్రాతిపాదికలపై ఉండటం వల్ల జాతీయ సమైక్యతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. జాతీయ సమైక్యత అనేది ఒక ప్రబలమైన మానసిక భావోద్వేగం, ఒక ప్రాంతంలో కొన్నేళ్లపాటు జీవించినప్పుడు ఆ ప్రాంతం పట్ల మమకారం, ప్రేమ, అనుబంధం ఏర్పడతాయని అన్నారు. ఎలాంటి సందర్భాల్లో జాతి, మత, కుల, లింగ, ప్రాంత భేదాలు లేకుండా మనమంతా భారతీయులమనే విశాల భావోద్వేగం కలుగుతుంది. దేశం పట్ల ఉన్న ఇలాంటి భావజాలాన్ని జాతీయ సమైక్యత అంటారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయం ప్రకారం జాతీయ సమైక్యత అనేది ప్రజాబాహుళ్య ఆలోచనల పరంపర నుంచి వెలువడే మేధో కాంతి వంటిది. జాతీయ సమైక్యత అనేది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మనోవైజ్ఞానిక రంగాలకు సంబంధించిందని గుర్తు చేశారు. అలాగే ఆయా రంగాల్లో ప్రజలందరి మధ్య సత్సంబంధాలను ఐక్యం ఒక బృహత్తర కార్యభావం అన్నారు. జాతీయ సమైక్యతకు అవరోధాలు సమస్యలు జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న అవరోధాలు (మతతత్వం) భారతదేశం అనేక మతాలకు నిలయం. భారత రాజ్యాంగం అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని అందిపుచ్చుకుని తటస్థ వైఖరి కలిగి ఉంటుంద న్నారు. మత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులను కల్పించిందన్నారు. దేశంలో పలు మతాల మధ్య గల భేదాల ఆధారంగా మతతత్వాన్ని ఒక రాజకీయ వాదంగా ఉపయో గించుకోవడం వల్ల అది మతమౌఢ్యానికి దారితీసిందన్నారు. చారిత్రకంగా పరిశీలిస్తే మన దేశంలో బ్రిటిష్ పాలనా కాలంలోనే మత గుర్తింపులు ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చాయన్నారు. బ్రిటిష్ వారి కాలంలో మత ప్రతిపాదికన ఏర్పాటైన సంస్థలు, ప్రత్యేక ఓటర్లు, బ్రిటిష్ వారి విభజించు–పాలించు విధానం, మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం మొదలైన వాటి ఫలితంగా భారత్ రెండు దేశాలుగా విడిపోయింది (పాకిస్థాన్ విడిపోవడం). ఈ విభజన ఒక విషాద ఘటనగా మిగిలిపోయింది. ఈ సందర్భంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించే ప్రయత్నం జరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రజల్లో మత విభజన స్పష్టంగా గోచరిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, గుజరాత్, మహారాష్ట్రల్లో మతపరమైన హింస జరుగుతూనే ఉంది. భారత సమాజంలో అనేక కులాలు, ఉపకులాలు ఉన్నాయి. కులపరమైన ప్రత్యేకతలు, కుల సంఘీభావం ఉండటం సమంజసమే. అయితే అది కులతత్వంగా పరిణమించి నప్పుడు జాతి సమైక్యతకు ప్రమాదంగా మారుతోందని కుల తత్వమంటే ఒక కులం పట్ల మరొక కులం ఈర్ష్య, ద్వేషం, పక్షపాతంతో కూడిన ప్రవర్తన.
అధికారం కోసం రాజకీయ పార్టీలు కులాన్ని ఒక సాధనంగా ఉపయోగించు కుంటున్నాయి. తద్వారా సమాజం కుల ప్రాతిపదికన విడిపోతోంది. అది దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమిస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం ఇటీవలి కాలంలో ఇవి అంతర్జాతీయ సమస్య లుగా పరిణమించాయి. భారత్‌తో పాటు చాలా దేశాలు ఈ సమస్యతో సతమతమౌతున్నాయని అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం పదాలకు నిర్వచనాలు వేరైనా వాటి ప్రభావం మాత్రం సమాజంపై ఎక్కువగా ఉంటోందని తెలియజేశారు. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో జరుగిన బాంబు పేలుళ్లు చూశామని చెప్పారు. భారత ఐక్యతకు సమగ్రతకు ప్రధాన సవాళ్లుగా పరిణమించాయని అన్నారు. నేరమయ రాజకీయాలు ఆధునిక వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాలుగా మారిన అంశం రాజకీయ ప్రక్రియ నేరమయం కావడం.విషేశం అన్నారు. 1993లో ఎన్ఎన్ వోహ్రా కమిటీ ఈ అంశంపై సాధికారిక నివేదిక ఇచ్చిందన్నారు. కొందరు రాజకీయ నాయకులు, మాఫియాతో కుమ్మక్కై భూముల ఆక్రమణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పాలనకు ఇది పెను సవాలుగా మారిందన్నారు.. రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ప్రాంతీయ ఉద్యమాలు భాష, సంస్కృతుల పరిరక్షణకు మాత్రమే పరిమితమై ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ సమస్య సమసిపోయిందన్నారు. 1975 నాటి ప్రాంతీయ ఉద్యమాలు ఆర్థిక సమానత్వం కోసం వచ్చాయన్నారు. ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలు ఇతర ప్రాంతాల ఆధిపత్యానికిలోనై సాంస్కృతిక ప్రత్యేకతను కోల్పోతాయన్నారు. మొదట్లో ఈ ఉద్యమాలకు సంబంధించి వాటి న్యాయమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినా తర్వాత వాటిని అణగదొక్కే యత్నం జరిగిందన్నారు. దీంతో అవి శాంతిభద్రతలు, ఐక్యత, సమగ్రతలకు తద్వారా రాజ్యాంగ అమలుకు సవాలుగా మారాయన్నారు. కుల బహిష్కరణ వంటివి ఇప్పటికీ కొనసాగుతున్నా యన్నారు.
Attachments area