ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
ఖమ్మం,ఫిబ్రవరి28(జనంసాక్షి): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కూసుమంచి మండలంలోని పలు పాఠశాలల్లో శనివారం ఘనంగా జరిపారు. పాలేరులోని జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సైన్స్ స్జబెక్టులో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్‌ను, ధృవపత్రాలను అందించారు. కూసుమంచిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని సర్తాజ్‌బేగం, ఉపాధ్యాయులు సీవీరామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.