ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు.
కోటగిరి సెప్టెంబర్ 17 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంతో పాటుగా ఆయా గ్రామాలలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శనివారం రోజున మండలంలోని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలతో పాటుగా పార్టీ దిమ్మల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయులకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.