ఘనంగా దత్తా జయంతి వేడుకలు

 

రామారెడ్డి డిసెంబర్ 8 జనం సాక్షి

ఘనంగా దత్త జయంతిని వేడుకలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయానికి ఒక రోజు ముందు తెల్లవారుజామున వివిధ మార్గాల గుండా భక్తులు తండోపతండాలుగా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో గల పవిత్ర పుణ్యక్షేత్రం దత్తాత్రేయ ఆశ్రమం వద్దకు చేరుకున్నారని అన్నారు. దత్త ఆశ్రమంలో పీఠాధిపతుల వంశపరం పరంగా కొనసాగుతుందని అన్నారు. ఈ సంవత్సరం ఉమాకాంతరావు పిఠాధిపతి ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ వేడుకలు సప్తహారం ఏడు రోజుల పాటు కొనసాగుతాయని అన్నారు. దత్త జయంతి తో ముగింపు అవుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం అదనపు గదుల కోసం విరాళాల రూపంలో భక్తుల సహాయార్థం గదులు నిర్మించామని చెప్పారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. జయంతిని పురస్కరించుకొని మూల విరాట్ దత్తాత్రేయ విగ్రహాన్ని తొట్టెల్లో వేసి జోలపాట పాడి భక్తుల భజన సంకీర్తనలతో ఆలయం మార్మోగింద న్నారు.కోరుకున్నవారికీ కొంగు బంగారంగ దినదినం అభివృద్ధి చెందుతూ , విరసిల్లుతుందని అన్నారు. అనంతరం గోపాల కాలువలు నిర్వహించామని చెప్పారు. భక్తులను వేధ మంత్రోత్సవాలతో పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ , విష్ణు, ఈశ్వరడు, బ్రహ్మ ఈ ముగ్గురు త్రిమూర్తుల ప్రత్యక్ష దైవం దత్తాత్రేయుడు అని అన్నారు. లోకా కళ్యాణం కోసం అవతరించిన కలియుగ దైవం భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం దత్తాద్రయుడు అని అన్నారు. ఆయన చిన్న తనంలో తన స్వగ్రామం పోసానిపేట్ నుండి తన కుటుంబ సభ్యులతో కాలినడకన జాతరకు వచ్చేవాడినని ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఆధ్యాత్మికంగా మానవునికి ఆలయాలను దర్శించుకోవడం మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు.
అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి వైస్ ఎంపీపీ రవీందర్ రావు మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి ఎంపీటీసీ ఉమా దత్తాద్రి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు నాయకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు