ఘనంగా నిర్వహించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి
బూర్గంపహాడ్ జూలై 06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక బి జె పి పార్టీ మండల అధ్యక్షుడు చుక్కపల్లి బాలాజీ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని బిజెపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు వెంకటరెడ్డి పాల్గొని ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ధర్మం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన స్పూర్తితో దేశం లో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, గుగులోతు బాలు నాయక్, కేశగాని శ్రీనివాస్ గౌడ్, దుప్పటి సురేష్, మహిళ మోర్చామండల అధ్యక్షురాలు బెల్లపు కొండ అనిత, వెలిశెట్టి రామారావు, పాలెం రవీంద్ర రెడ్డి, కోడెబోయిన రవి, సాయి, తదితరులు పాల్గొన్నారు.