ఘనంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వరస్వామి 26వ బ్రహ్మోత్సవాలు
వినుకొండ, జూలై 31: పట్టణంలోని వేంచేసిన ఆలివేలుమంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలు ఏడవరోజుకు చేరాయి. ఆలయ కమిటి నిర్వాహకులు ఏర్పాటు చేసిన నూతన రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జివి ఆంజనేయులు పాల్గొన్నారు. ఆలయ అర్చక ఆధ్వర్యంలో ప్రతిరోజూ తెల్లవారుజామునుండే స్వామివారికి ఆరాధన, సేవాకాలం, బాలభోగనివేదన, నిత్యహోమాలు, విష్ణుసహస్త్రనామ స్తోత్ర పారాయణ, నిత్య మంగళ శాసన పూజలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బంగారయ్య, సుబ్బయ్య, శీను, రామారావు తదితరులు పాల్గొన్నారు.