ఘనంగా నివాళులు అర్పించిన మండల ప్రజా ప్రతినిధులు ,నాయకులు
కేసముద్రం ఆగస్టు 30 జనం సాక్షి /మండల టీఆర్ఎస్ నాయకులు సారంపల్లి వెంకట్ రెడ్డి,మోహన్ రెడ్డి తండ్రి ఆగా రెడ్డి ఇటీవల స్వర్గస్తులవగా మంగళవారం వారి స్వగృహంలో మండల ప్రజాప్రతినిధులు,నాయకులు ఆగా రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల శ్రీనాధరెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, ఇంటికన్నె సర్పంచ్ సరిత రమేష్,ధనసరి పీఏసీఎస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ,కేసముద్రం విలేజ్ సర్పంచ్ ప్రభాకర్, కేసముద్రం టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్ ,సంపత్ రెడ్డి, ఇంటికన్నె గ్రామ పార్టీ అధ్యక్షులు టేకుల శీను తదితరులు పాల్గొన్నారు.