*ఘనంగా పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకలు*
పెద్దేముల్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల కేంద్రంలో ఆదివారం పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 106 వ జయంతి వేడుకలను పెద్దేముల్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సందీప్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మత మానవతా వాదీ అని ఆయన ఒక మహనీయుడు హిందు ధర్మం కోసం కృషి చేశారని అన్నారు.దీన్‌దయాల్ ఉపాధ్యాయ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఆయనలోని దేశభక్తిని పునికిపుచ్చుకోవాలని తెలిపారు.వారి యొక్క అడుగుజాడల్లో అందరూ నడవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి హరీష్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాము, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రమేష్ సాగర్, నాయకులు పరిపూర్ణ చారి, కృష్ణ, సాయి, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.