ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

మత్స్యకారుల జెండా ఎగరేసిన మండల అధ్యక్షుడు బొ ల్లెద్దుల బాలరాజు

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (21): మండల కేంద్రంలో ప్రపంచ మత్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల సంఘం మండల అధ్యక్షుడు బొల్లెద్దుల బాలరాజు మత్స్యకారుల జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదికాలం నుండి ముదిరాజుల వెనుక బాటుతనాన్ని కారణమైనటువంటి ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత ముదిరాజులదని ముదిరాజుల ప్రధానమైన అటువంటి కోరికలు వెంటనే నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కార్మికులకు పనిముట్లు ఉచిత జీవిత బీమా కల్పించారన్నారు. అదేవిధంగా ముదిరాజుల మత్సకారుల ప్రధాన డిమాండ్స్ ఆరు డిమాండ్లను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చొరవ తీసుకొని ముదిరాజుల మత్సకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.విద్య ఉద్యోగాల్లో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయం నివారణ కోసం బిసి డి నుండి బీసీ ఏ కు మార్చే ప్రక్రియ బీసీ కమిషన్ ద్వారా వెంటనే చేపట్టాలి.అన్ని జిల్లాలో ఫిషరీస్ సొసైటీల ఎన్నికలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ కు ఎన్నికలు జరిపించాలి. మత్స్య సంపద దోపిడీ నివారణకు కొరకు మత్స్య సంరక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కొరకు 1000 కోట్లరూపాయలుకేటాయించాలి.తెలంగాణ మత్స్య శాఖకు 3000 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల రూపంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి.తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నదులు మేజర్ రిజర్వాయర్లలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని చేపట్టి తద్వారా వచ్చే ఆదాయాన్ని మత్స్యకారకు పంచాలి. ఈ కార్యక్రమంలో మత్సకార సంఘం నాయకులు రాముడు, వెంకటయ్య, లక్ష్మీనారాయణ, సాయిబాబు, సత్యనారాయణ, వెంకటేష్, గోపి, స్వామి, రమేష్, శేఖర్, మనోహర్, ఉదయ్, శివ, కురుమూర్తి, శీను లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.