ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం జెండా పండుగలో పాల్గొన్న నాయకులు,మత్స్యకారులు

 వనపర్తి టౌన్ :నవంబర్ 21 ( జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ తెలుగు మత్స్యకార సంఘం, అధ్యక్షుడు కాగితాల లక్ష్మీనారాయణ అధ్యక్షతన ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఘనంగా జెండా పండుగను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయం చైర్మన్ లక్ష్మయ్య వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ,జిల్లా అధ్యక్షులు చిన్న రాములు, ప్రసంగించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, మంత్రి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మత్సకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. మత్సకారులకు సబ్సిడీతో వాహనాలు ఇవ్వడం గర్వించదగ్గ విషయమని, ముదిరాజ్ మత్స్యకారుల ప్రధానమైన డిమాండ్లు బీసీ డీ, నుంచి బిసి ఏ, కు మార్చి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించాలని మత్స్య పారిశ్రామిక శాఖకు 3000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలని ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల ఫండ్స్ ఏర్పాటు చేయాలని,చెరువులు,కుంటలు, నీటిపై పూర్తి యాజమాన్య హక్కు మత్స్య సంపదపై మత్స్యకారులకు ముదిరాజులకు కేటాయించే విధంగా జీవో జారీ చేయాలని, జిల్లా స్థాయిలో అన్ని సొసైటీలకు ఎన్నికలు జరిపి ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు, చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి మత్స్యకారుల తరఫున కేసీఆర్ ను ఒప్పించి న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని, విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా మత్స్యకారుల తరఫున వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక ఎకరా స్థలాన్ని మత్సకారుల భవంతు కేటాయించినందుకు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట బాలరాజ్,అధ్యక్షులు బలేమోని కృష్ణయ్య,ఉపాధ్యాయులు లక్ష్మయ్య, రంగన్న, శాంతయ్య, పిట్టల శీను, మేఘనాథ్, కోశాధికారి రంగసామి,మన్యం మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజావార్తలు