ఘనంగా ప్రారంభమైన కృష్ణస్వామి ఉత్సవాలు

మల్ధకల్ఆగస్టు 20 (జనంసాక్షి) శ్రావణ మాసంలో అన్నీ విశేషాలే అత్యంత భక్తిభావంతో ,ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు.ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ,వరలక్ష్మీ వ్రతంతో పాటు శ్రీ కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు. జరుపుకుంటారు.జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని సద్దలో ని పల్లెలో స్వయంభుగా వెలసిన శ్రీకృష్ణుని అత్యంత వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు శ్రావణమాసం ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం  జరుగును.ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీకృష్ణుని భక్తితో  కొలిచిన వారికి కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులకు అపార నమ్మకం 400 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా  ఇక్కడ భక్తులు అన్నారు .అతి పురాతనమైన దేవాలయం మొదటగా పుట్టగా వెలిసిన ఆ తరువాత ఆ పుట్టలోనే స్వయంభుగా కృష్ణుడు వెలసినట్టు చరిత్ర చెబుతుంది.సద్దలోని పల్లె గ్రామ ప్రజలు.పెద్దలు తెలుపుతున్నారు. ఇక్కడ భక్తితో పూజలు జరిపి మొక్కుకున్నచో  కోరికలు నెరవేరుతాయని ఇక్కడ  స్వయంభూగా వెలిసిన క్రిష్ణ స్వామికి అపార  శక్తివంతమైన మహిమ గలిగిన దేవుడని  భక్తులు భక్తిశ్రద్ధలతో వచ్చి మొక్కలు నెరవేరుస్తున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని,ఆలయ కమిటీ వారు తెలియజేశారు.